Home / HYDERBAAD / హైదరాబాద్ లో ఆరేండ్లలో 67వేల కోట్ల అభివృద్ధి

హైదరాబాద్ లో ఆరేండ్లలో 67వేల కోట్ల అభివృద్ధి

‘ఎన్నో స్కీంలు.. మరెన్నో కట్టడాలు.. ఇంకెన్నో అద్భుతాలు.. ఈ ఆరున్నరేండ్ల తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు.. కాస్మొపాలిటన్‌ నగరం అనువైన మౌలిక సదుపాయాలతో నగిషీలు దిద్దుకొన్నది.  అభివృద్ధి గురించి మాటలు చెప్పడమే కాదు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించింది. ఒక్కసారి భాగ్యనగరాన్ని నలువైపులా వీక్షిస్తే చాలు అభివృద్ధి అంటే ఎంటో అవగతమవుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్‌లో ఆవిష్కృతమైన అద్భుతాల్లో కొన్ని…  నమస్తే తెలంగాణ నుండి మీకోసం

దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్ట్రా డోస్డ్‌ కేబుల్‌ బ్రిడ్జి. 

దీని పొడవు 233.85 మీటర్లు. పర్యాటకంగానూ ఎంతగానో ఆకట్టుకొంటుంది. జపాన్‌, చైనా తరహాలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, గ్రేడ్‌ సెపరేటర్లు, రైల్వే బ్రిడ్జిలు, రోడ్డు అండర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాస్‌ల నిర్మాణం చేపట్టింది సర్కార్‌. రూ.8,410 కోట్లు ఈ పనులకు వెచ్చించింది. ఇప్పటికే 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 రోడ్లు-ఓవర్‌బ్రిడ్జిలు, ఒక కేబుల్‌ వంతెన అందుబాటులోకి వచ్చాయి.

టీఎస్‌ ఐపాస్‌…వ్యయం 2115.93 కోట్లు

 • టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పారిశ్రామికీకరణ అభివృద్ధి
 • 9,500 పారిశ్రామిక యూనిట్లకు అనుమతి, అందులో 6,300 యూనిట్ల ఏర్పాటు
 • విమానయాన హబ్‌గా హైదరాబాద్‌. టాటా బోయింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, సీకోర్‌ స్కీం వంటి సంస్థల ఆపరేషన్స్‌ ప్రారంభం
 • వరుసగా ఐదో సంవత్సరం ఉత్తమ నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌

టీ-హబ్‌ స్టార్టప్‌ల కోసం  కేటాయింపు

 • వినూత్న ఆవిష్కరణలు రూపుదిద్దుకునేందుకు వీలుగా ఏర్పాటు
 • స్టార్టప్‌, ఎంట్రప్రెన్యూర్‌ సంస్థలను ఆకర్షించే లక్ష్యం
 • ఇప్పటికే 1100కుపైగా స్టార్టప్‌ల అనుసంధానం
 • 1500లకు పైగా ఉద్యోగాల కల్పన

టీఎస్‌ఐసీ (తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌)

 • రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా గొప్ప చర్యలు
 • ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం
 • పాఠశాల స్థాయినుంచే ఆవిష్కరణలు పెంపొందించే సంస్కృతి

స్వచ్ఛ హైదరాబాద్‌ రూ. 1,716.33 కోట్లు

 • 125 ఎకరాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో ఘనవ్యర్థాల డంపింగ్‌ యార్డ్‌ క్యాపింగ్‌
 • పారిశుద్ధ్యం కోసం 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్ల ఏర్పాటు
 • శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త సేకరణ
 • ఘనవ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి
 • డంపింగ్‌ యార్డు క్యాపింగ్‌
 • మూడు వేల పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటు
 • ఘన వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో తరలించే అత్యాధునిక వాహనాలు

శాంతిభద్రతలు – 1940.33 కోట్లు

 • అత్యాధునిక పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం
 • 5 లక్షల సీసీ కెమెరాలు, హ్యక్‌ ఐ యాప్‌
 • పోలీస్‌ గస్తీ బృందాల కోసం అధునాతన వాహనాలు
 • ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌ స్టేషన్లలో సదుపాయాల మెరుగు
 • నేర ఛేదనలో తోడ్పడుతున్న అత్యుత్తమ నిఘా వ్యవస్థ
 • నగరాన్ని అనుక్షణం కనిపెట్టుకునేలా ఇంటిగ్రేటెడ్‌ పీపుల్‌ ఇన్ఫర్మేషన్‌ హబ్‌
 • మహిళలు, చిన్నారుల రక్షణ కోసం షీటీంల ఏర్పాటు
 • సైబర్‌ నేరాల నియంత్రణ, ఛేదనకు ప్రత్యేక వ్యవస్థ

పాదచారుల సౌకర్యాలు

 • ఫుట్‌పాత్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవాక్‌ల నిర్మాణం
 • రోడ్లకు ఇరువైపులా 430 కి.మీ. మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం
 • జాతీయ సగటు 0.52 కన్నా అధికంగా 0.68 ఫుట్‌పాత్‌ల ఏర్పాటు
 • పాదచారుల కోసం 57 ఎఫ్‌వోబీలు ప్రతిపాదించగా, ఏడుచోట్ల నిర్మాణం
 • వీధులను ఆధునీకరించి డిజైన్లలో మార్పులు చేయడం ద్వారా పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు అనువుగా ఉండేలా అవరోధాలు లేకుండా నిర్మాణం
 • ఒక్కో జోన్‌లో 10 కి.మీ. మేర సైక్లింగ్‌ సదుపాయాల ఏర్పాటు
 • వినూత్న రీతిలో 8 ప్రాంతాల్లో స్కైవాక్స్‌ నిర్మాణం

బస్తీ దవాఖానలు

 • వ్యయం రూ. 30.51కోట్లు
 • దేశంలోనే తొలిసారిగా అర్బన్‌ లోకల్‌ బాడీ కమ్యూనిటీ క్లినిక్‌ల ఏర్పాటు
 • మెరుగైన వైద్యంకోసం ఆరోగ్య సంబంధిత వసతుల పెంపు
 • మొత్తం 250 దవాఖానాల ఏర్పాటు
 • ఒక్కో కేంద్రానికి రోజూ 85-100 మంది రోగుల సందర్శన

సాఫ్ట్‌ నెట్‌

 • యువత అభిలాషకు అనుగుణంగా ఉండే ఎడ్యుకేషన్‌ చానల్‌
 • సాఫ్ట్‌ నెట్‌ రెండు టీ-శాట్‌ చానళ్ల ప్రారంభం.  టీశాట్‌ విద్య, టీశాట్‌ నిపుణ
 • నిపుణులైన లెక్చరర్లు బోధించిన 900 గంటల క్లాసులు
 • ఇంగ్లిష్‌ ఫర్‌ ఆల్‌ స్పెషల్‌ ప్రోగ్రాం, పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల అనుబంధంతో ‘అవేర్‌నెస్‌ ఆన్‌ చైల్డ్‌’ అబ్యూజ్‌ కార్యక్రమం ఏర్పాటు

రిచ్‌(రిసెర్చ్‌, ఇన్నోవేషన్‌)

 • ఆవిష్కర్తలను గుర్తించి మార్కెట్లకు అందించేందుకు రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) ఏర్పాటు

టీ-వర్క్స్‌

 • ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రో మెకానికల్‌, మెకానికల్‌ స్టార్టప్‌ సంస్థలను ప్రోత్సహించేందుకు టీ-వర్క్స్‌ ఏర్పాటు

వీ హబ్‌

 • మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు వీ-హబ్‌ ఏర్పాటు
 • 3,427 మహిళా పారిశ్రామిక వేత్తలు
 • 148 స్టార్టప్‌ ఇంక్యుబేటర్లు
 • 12 స్టార్టప్‌ ప్రోగ్రామ్‌లు
 • 320 ఉద్యోగాల కల్పన
 • 36.2 కోట్ల నిధులు

టాస్క్‌

 • స్కిల్స్‌, నాలెడ్జ్‌ ఉన్నవారికోసం తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఏర్పాటు
 • స్కిల్స్‌ సంపాదించేలా శిక్షణ ఇచ్చి, ఉద్యోగానికి అర్హులుగా తీర్చిదిద్దే అద్భుత కార్యక్రమం