తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం మొదలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. దయచేసి అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. గ్రేటర్ అభివృద్ధికి పాటు పడాలని మంత్రి కేటీఆర్ వినతి చేశారు.