Home / HYDERBAAD / జీహెచ్‌ఎంసీ పోలింగ్ అప్డేట్.. ఓటు వేసిన సినీ ప్రముఖులు వీళ్ళే

జీహెచ్‌ఎంసీ పోలింగ్ అప్డేట్.. ఓటు వేసిన సినీ ప్రముఖులు వీళ్ళే

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు మంగళవారం ఉదయం ప్రారంభమైయాయి.మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

* మెగాస్టార్‌ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కును వియోగించుకున్నారు

* ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు వేశారు.

* సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులు ఓటు వేశారు. అందరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు

* నిర్మాత ఉషా ముల్పూరి షేక్ పేటలో తన ఓటు హక్కను వినియోగించుకున్నారు