ప్రపంచంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న
నగరాల్లో హైదరాబాద్ గడిచిన ఐదారేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం.
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలకు తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.