ఆసీస్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు న్యూఇయర్ డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లడం దుమారం రేపింది ఈ నేపథ్యంలో టీమిండియా సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇందులో అందరికీ నెగెటివ్ వచ్చిందని BCCI వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో జట్టుతో పాటే ఐదుగురు ఆటగాళ్లు ఒకే విమానంలో సిడ్నీ వెళ్లారని పేర్కొంది.