వేధింపుల ఆరోపణలతో ఓ యువతి కుటుంబసభ్యులు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. మాయా శంకర్ కు వారణాసిలో ఇంజినీరింగ్ కళాశాల ఉంది.
అందులో చదివే ఓ అమ్మాయిని శంకర్ వేధించారని పేర్కొంటూ యువతి తాలూకా వ్యక్తులు ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి చితకబాదారు.
అయితే ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చివరికి తాను చేసిన తప్పుకు పాఠక్ క్షమాపణలు సైతం చెప్పారు