Home / MOVIES / హద్దులు దాటిన బుట్ట బొమ్మ

హద్దులు దాటిన బుట్ట బొమ్మ

స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో క‌లిసి రాధేశ్యామ్ చిత్రంతోపాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో క‌లిసి న‌టిస్తోంది.

కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆచార్య సినిమాలో కీ రోల్ కోసం మేక‌ర్స్ ఈ భామను సంప్రదించిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. రాంచ‌ర‌ణ్ గెస్ట్ రోల్ చేస్తుండ‌గా..పూజాహెగ్డే చెర్రీకి జోడీగా న‌టిస్తున్న‌ట్టు టాక్‌.

అయితే పూజాహెగ్డే ఈ చిత్రానికి సంత‌కం చేయాలంటే మేక‌ర్స్ కు ఓకండిష‌న్ పెట్టింద‌ట‌. సౌతిండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒక‌రిగా ఉన్న పూజా..త‌న‌కు పూర్తిస్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఇస్తేనే సినిమాలో న‌టిస్తాన‌ని ష‌ర‌తు పెట్టింద‌ట‌. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా పూజా డిమాండ్‌కు మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.