Home / MOVIES / వివాదంలో మోనాల్ గజ్జర్

వివాదంలో మోనాల్ గజ్జర్

ఓ ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్ శ్రీ రాముడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశమంతా పూజించే దేవుడిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు నీకు శ్రీ రాముడి గురించి ఏం తెలుసు.. దేవుడి గురించి నోరు పారేసుకునేంత గొప్ప దానివి అయిపోయావా అంటూ నిలదీస్తున్నారు.

ఏ హక్కు ఉందని రాముడి గురించి మాట్లాడావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాబోయే వాడి గురించి కామెంట్ చేసింది మోనాల్. అందులో భాగంగానే మీకెలాంటి మొగుడు కావాలంటూ యాంకర్ అడిగితే శ్రీక‌ృష్ణుడు లాంటి భర్త కావాలి అంటూ జవాబిచ్చింది.

అదేంటి.. ఏ అమ్మాయైనా శ్రీ రాముడి లాంటి మొగుడు కావాలంటారు కానీ మీరేంటి కృష్ణుడు అంటున్నారు అంటూ యాంకర్ ప్రశ్నిస్తే.. దానికి ఊహించని సమాధానం చెప్పింది మోనాల్ గజ్జర్. తనకు రాముడు నచ్చడని..అనవసరంగా సీతను అనుమానించాడని..ఎవరో చెప్పిన మాటలను నమ్మి భార్యను అడవుల పాలు చేసాడంటూ చెప్పుకొచ్చింది.

ఒకవేళ ఆయన తనకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాముడు అలా చేసాడు కాబట్టే సీత పాతివ్రత్యం ప్రపంచానికి తెలిసింది అంటూ మండి పడుతున్నారు. ఏదేమైనా కూడా మోనాల్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat