Home / MOVIES / దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి

దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఉత్త‌రాది భామ లావ‌ణ్య‌త్రిపాఠి. ఈ  చిత్రం త‌ర్వాత ప‌లు ప్రాజెక్టుల్లో న‌టించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్‌కిషన్ తో క‌లిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో త‌ళుక్కున మెరిసింది. లావ‌ణ్య ఈ సారి యాక్టింగ్ లో త‌న‌ హ‌ద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ స‌న్నివేశాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా..? అంటూ  ఏ1 ఎక్స్ ప్రెస్  ట్రైల‌‌ర్ ను వీక్షించిన ప్రేక్ష‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఇప్ప‌టికే గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపించిన లావ‌ణ్య..ట్రైల‌ర్ లో లిప్ లాక్ సీన్ లాంటి స‌న్నివేశం క‌నిపిస్తుండ‌టంతో సిల్వ‌ర్ స్క్రీన్ పై లావ‌ణ్య త్రిపాఠి నిజంగానే ముద్దు సీన్ల‌లో న‌టించిందా..? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు కార్తికేయ హీరోగా న‌టిస్తోన్న చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో కూడా లావ‌ణ్య గ్లామ‌ర్ కోటెంట్‌ను పెంచేసింద‌ని సినీ జ‌నాలు అనుకుంటున్నారు.

ఈ భామ న‌టించిన ఏ 1 ఎక్స్‌ప్రెస్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. మ‌రి లావ‌ణ్య ఈ సారి తాను చేస్తున్న రోల్స్ కోసం లిమిట్స్ చెరిపేసుకుందా..? లేదా? అనేది తెలియాలంటే సినిమాలు విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల్సిందే.