బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.2.5, లీటర్ డీజిల్పై రూ.4 అగ్రి సెస్ విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది
