తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు తెలిపారు.