మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు చాలా స్లిమ్‌గా, క్యూట్‌గా ఉండేది. కాని కరోనా నుండి కోలుకున్న తర్వాత ఆమె శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. కొంచెం బొద్దుగా మారిన విషయాన్ని గమనించిన ఈ ముద్దుగుమ్మ స్లిమ్‌గా మారేందుకు జిమ్‌లో నానా కష్టాలు పడుతుంది.
వెరైటీ వర్కవట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. రీసెంట్గా బ్లాక్ ప్యాంట్, రెడ్ కలర్ టాప్ ధరించిన తమన్నా హాట్ లుక్స్‌తో హీటెక్కిస్తుంది.
హాట్ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తమన్నా.. మన శరీరాకృతి ఎలా ఉండాలనేది మైండ్ సెట్ చేస్తుంది. అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి అంటూ తమ్మూ తన ట్వీట్ లో పేర్కొంది. తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం .. గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సీటీమార్’ చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది.
ఏప్రిల్‌లో 2న ఈ సినిమా విడుదల కానుంది. ఇక నితిన్ సినిమా ‘అంధాదున్’ రీమేక్‌లో బోల్డ్ పాత్రలో నటించబోతుంది. మరోవైపు వెంకటేష్, వరుణ్ తేజ్,.. ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది.