ఏపీ సీఐడీ అధికారులు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని దళితులను మోసం చేసి రూ.500 కోట్లు దోచుకున్నారని విమర్శించారు.
రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి 500 ఎకరాలను కారుచౌకగా కాజేసి ప్రభుత్వానికి అధిక ధరలు అమ్ముకున్నారని తెలిపారు. వాస్తవానికి అసైన్డ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ ఉండదన్నారు