Breaking News
Home / SLIDER / జ‌గిత్యాలకు కిసాన్ రైలు

జ‌గిత్యాలకు కిసాన్ రైలు

తెలంగాణలోని జ‌గిత్యాల మామిడికి ఉత్త‌ర భార‌త‌దేశంలో మంచి డిమాండ్ ఉంది. మంచి రంగు, రుచి, వాస‌న ఉండ‌టంతో.. ఇక్క‌డ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, యూపీ, హ‌ర్యానా, పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్‌కు త‌ర‌లిస్తుంటారు. అయితే డిజీల్, పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డంతో.. రైలు మార్గంలో మామిడికాయ‌ల‌ను త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు జ‌గిత్యాల – లింగంపేట రైల్వే స్టేష‌న్‌కు కిసాన్ రైలు చేరుకోనుంది. తిరిగి రాత్రి 11 గంట‌ల‌కు ఆ రైలు ఢిల్లీ బ‌య‌ల్దేర‌నుంది.

ఇవాళ 20 వ్యాగ‌న్ల‌లో 460 ట‌న్నుల మామిడి కాయ‌ల‌ను త‌ర‌లించ‌నున్నారు. 14, 19వ తేదీల్లో కూడా జగిత్యాల నుంచి మామిడికాయ‌ల‌తో రైలు ఢిల్లీకి వెళ్ల‌నుంది. ఈ సీజ‌న్ ముగిసే వ‌ర‌కు కిసాన్ రైలును న‌డ‌పాల‌ని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైలును ఉప‌యోగించుకుంటే 50 శాతం సబ్సిడీ ఇస్తారు.

ఈ రైలు ద్వారా మామిడికాయ‌ల‌ను త‌ర‌లించ‌డంతో ర‌వాణా ఖ‌ర్చులు త‌గ్గ‌డ‌మే కాకుండా ఒక్క‌రోజులోనే ఢిల్లీకి చేరుతాయ‌ని మామిడి వ్యాపారుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాధిక్ తెలిపారు. దీంతో రైతుల‌కు కొంత రేటు పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు.