Home / SLIDER / సిద్ధిపేటలో త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ప్రారంభం

సిద్ధిపేటలో త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ప్రారంభం

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ- త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ను పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్ :

– సిద్ధిపేట పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది.

– పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్రీ టౌన్ పోలీసు స్టేషన్.

– ప్రజలు పోలీసుల్లో భాగమే.., పోలీసులు ప్రజల్లో భాగమే అన్న రీతిలో గుణాత్మకమైన మార్పు తెచ్చి
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నాం.

– దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు వాడుతున్న రాష్ట్రం తెలంగాణ, వాటిలో సిద్ధిపేట జిల్లా పేరొందింది.

– జిల్లా ఏర్పాటు, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కావడం, మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్ నిర్వాసితులు ఇక్కడ స్థిరపడటం, పరిశ్రమలు ఏర్పాటుతో పట్టణం వేగంగా అభివృద్ధి సాధిస్తున్నది.

– ఇది ముఖ్యమైన పోలీసు స్టేషన్-PS, కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, మెడికల్ కళాశాల, ఐటీ హబ్, సిద్దిపేట ఇండస్ట్రీయల్ ఎస్టేట్, జిల్లా కోర్టు భవనాలు, ఇవన్నీ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.

– కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మానకొండూర్ పోలీస్ స్టేషన్ 80 కి.మీ. వరకు రాజీవ్ రహదరిపై మరో పోలీస్ స్టేషన్ లేదని సిద్దిపేట 3వ టౌన్ రాజీవ్ రహదారిపైనే ఏర్పాటు చేశాం.

– తెలంగాణ పోలీస్ లా అండ్ ఆర్డర్ లో దేశానికే ఆదర్శంగా ఉంది.

– తెలంగాణ వచ్చాక పేకాట, గుడుంబా లాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాం.

– ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలతో సత్సంబంధాలు నెలకోల్పుతున్నాం.

– సీసీ- CC కెమెరాలు పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేశాం.

– జిల్లాలో 7 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.

– దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు వాడుతున్న రాష్ట్రం తెలంగాణ.

– అద్భుతమైన ఫలితాలను సీసీ కెమెరాలు అందిస్తున్నాయి.

– సఖి సెంటర్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ భరోసా కేంద్రం, చైల్డ్ కోర్టు ఇవన్నీ ఒకే కాంప్లెక్స్ లో త్వరలోనే ఏర్పాటు చేస్తాం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat