గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా 1&2వ డివిజన్ గుండ్లసింగారం, పెగడపల్లి, వంగపహాడ్ గ్రామాలలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 1&2వ డివిజన్ అభ్యర్థులు గణిపాక కల్పన, బానోత్ కల్పన గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 13డివిజన్లలో ఏకపక్షంగా గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆరెఎస్ అభ్యర్థుల గెలుపుకు సోపానలని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో వరంగల్ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు, వరంగల్ నాగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి నగర ప్రజలు టీఆరెఎస్ పార్టీకి ఓటు వేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, డివిజన్ ఇంచార్జ్ లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.