తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గారి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు ఇసోలేషన్ లో వున్న సీఎంకు వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు నేడు గురువారం రానున్నాయి.