తెలంగాణలో గత 24 గంటల్లో 77,091 కరోనా టెస్టులు చేస్తే 7,646 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 4,35,606కు చేరింది. నిన్న కరోనాతో 53 మంది చనిపోగా, మరణాల సంఖ్య 2,261గా ఉంది.
గత 24 గంటల్లో 5,926 మంది కరోనాను జయించారు. 77,727 యాక్టివ్ కేసులున్నాయి. మరణాల రేటు 0.51% కాగా రికవరీల రేటు 81.63%గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,29,05,854 కరోనా టెస్టులు చేశారు.