Home / NATIONAL / దేశంలో కరోనా ఉద్ధృతి హోరు

దేశంలో కరోనా ఉద్ధృతి హోరు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,498 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరగా మరణాల సంఖ్య 2,08,330గా ఉంది.

మరోవైపు కరోనాను జయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,97,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,70,228గా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 19,20,107 కరోనా టెస్టులు చేశారు.