వెస్ట్ బెంగాల్ సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి బరిలోకి దిగిన మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆర్టికల్ 164(4) ప్రకారం మంత్రిగా/ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 6 నెలల్లోపు చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకోవాలి.
బెంగాల్లో శాసనమండలి లేదు కాబట్టి మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఒకవేళ ఉపఎన్నికల్లో గనుక మమత ఓడిపోతే సీఎంగా రాజీనామా చేయాల్సిందే.