Breaking News
Home / SLIDER / కరోనా వేవ్ తీవ్రతపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కరోనా వేవ్ తీవ్రతపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా రెండోవేవ్ తీవ్రత మే 15 తర్వాత తగ్గొచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా నిరోధానికి ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అటు ప్రధానితో ఫోన్లో మాట్లాడిన సీఎం.. తెలంగాణకు రోజుకు 500 టన్నుల ఆక్సిజన్ కావాలని కోరారు. రోజువారీగా 2 లక్షల నుంచి 2.5లక్షల కరోనా టీకాలను సరఫరా చేయాలన్నారు. రెప్రెసివిర్ ఇంజక్షన్ల సంఖ్యను రోజుకు 25 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.