అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు..
తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది.
ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.