ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది.
కోడిగుడ్డు ధర రోజురోజుకూ కొండెక్కుతున్నది. ఈ నెల మొదటివారంలో రైతువద్ద గుడ్డు లిప్టింగ్ ధర రూ.3.67 ఉంటే.. ప్రస్తుతం రూ.5.18గా ఉన్నది. హోల్‌సేల్ వ్యాపారులకు రూ.6 పడుతుండగా.. వినియోగదారులకు చేరే సరికి రూ.6.50 నుంచి రూ.7 అవుతున్నది.
నెల రోజుల్లోనే గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.