ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది.
2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు ఉంటారు.