Home / MOVIES / మిల్క్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

మిల్క్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్‌డమ్‌ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాలనే ప్రేక్షకులు గౌరవిస్తున్నారని తెలిపింది. ఓటీటీ శరవేగంగా విస్తరించడంతో సినిమాల్ని ఎంచుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంది.

ఆమె మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ప్రతి తారకు నమ్మకమైన అభిమానగణం కనిపించేది. అభిమాన నాయిక సినిమా కోసం ఎన్ని రోజులైనా వేచిచూసేవారు. ఓటీటీ ఆగమనంతో కంటెంట్‌ సినిమాల్ని శాసిస్తోంది.

ప్రధాన స్రవంతి సినిమాలకు భిన్నంగా వినూత్న కథల్ని ఎంచుకోవడానికి ఓటీటీ గొప్ప మార్గంగా కనిపిస్తోంది. ప్రతిభావంతులైన రచయితలు, నటీనటులకు ఓటీటీ పెద్దపీట వేస్తోంది.

పాత్రపరంగా కొత్తదనాన్ని చూపించడంతో పాటు ప్రతిభకు మెరుగులుదిద్దుకోవడానికి ఓటీటీకి మించిన వేదిక లేదు’ అని చెప్పుకొచ్చింది. తెలుగులో ‘లెవన్త్‌ అవర్‌’, తమిళంలో ‘నవంబర్‌స్టోరీ’ ఓటీటీ సిరీస్‌ల ద్వారా తమన్నా డిజిటల్‌ రేసులో దూసుకుపోతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino