అప్పుడేప్పుడో విడుదలైన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చందమామ సినిమాతో తొలి హిట్ కొట్టిన కాజల్ మగధీర చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది.
సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగానే ఉంది. ఈ క్రమంలో ఆస్తులు బాగానే కూడబెట్టింది.కాజల్ కార్లు మరియు స్థిర ఆస్తులు వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్ల వరకు ఉన్నాయని సమాచారం.
బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడబెట్టి అందరికి షాక్ ఇచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వరసు సినిమాలు చేస్తున్న కాజల్ స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి వ్యాపారం చేస్తుంది.