Home / SLIDER / గెజిటెడ్ అసోసియేషన్ నేత జగన్మోహన్ రావు ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

గెజిటెడ్ అసోసియేషన్ నేత జగన్మోహన్ రావు ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్ రావు తల్లి పద్మావతి ఐటీవల మృతి చెందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి శుక్రవారం జగన్మోహన్ రావును హన్మకొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. పద్మావతి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.