తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తామని, ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.