Home / SLIDER / తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు.

జూలై 26 నుంచి 31 తారీఖు దాకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్ ను సీఎం ఆదేశించారు.