టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం తాజాగా సొషల్ మీడియాలో అధికారక ప్రకటన ఇచ్చింది.
ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వాకి జంటగా నటిస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ – కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో ఇంతకముందు వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ క్రమంలో వీరి కాంబోలో నాలుగో చిత్రంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రాబోతోంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవగా, హీరోహీరోయిన్స్‌తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.