Home / MOVIES / శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది-శిల్పాశెట్టి సంచలన వ్యాఖ్యలు

శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది-శిల్పాశెట్టి సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఫోర్న్ చిత్రాల వ్యాపార కేసులో అరెస్టు చేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా నటి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నటి శిల్పాశెట్టి  తన భర్త అమాయకుడని, హాట్‌షాట్స్‌ యాప్‌లోని కంటెంట్‌ ఏమిటన్న వివరాలు తనకు తెలీదని  స్పష్టం చేశారు.

ఈ విచారణలో ఆమె తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘రాజ్‌ కుంద్రాకు వరసకు బావ అయ్యే ప్రదీప్‌ బక్షి హాట్‌షాట్స్‌ యాప్‌ను చూసుకుంటున్నారు. కుంద్రా నీలి చిత్రాలను(పోర్న్‌) తీయలేదు.

శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది’’ అని శిల్ప పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా..ఈ కేసులో ఇప్పటి వరకూ రూ. 7.5 కోట్లను, సుమారు 48 టెరాబైట్లు ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.