Home / MOVIES / నక్క తోక తొక్కిన హాట్ యాంకర్

నక్క తోక తొక్కిన హాట్ యాంకర్

బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. సమంత అక్కినేనితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా “నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్‌తో ఉంటుంది.

గుణశేఖర్ లాంటి గొప్ప దర్శకుడితో పని చేయడం ఓ అద్భుతమైన అనుభవం. షూటింగ్ మొదటి రోజు.. నేను ఎప్పుడూ స్టార్స్‌తో పని చేయలేదు. కానీ మొదటిసారి నేను సమంత అక్కినేనితో కలిసి పని చేయబోతున్నాను.. చాలా సంతోషంగా ఉంది.” అంటూ ఆనందంగా తాను కూడా చిత్రీకరణలో పాల్గొంటున్న విషయాన్ని తెలిపింది వర్షిణి. ఇక ఈ సినిమాతో పాటుగా ‘మళ్ళీ మొదలైంది’లో సుమంత్ భార్యగానూ నటిస్తోంది.