సినీ నటి ఖుష్బూ అందరికి సుపరచితమే .తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా సత్తా చాటుతుంది ఖుష్బూ. ఒకప్పుడు కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఖుష్బూ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది.
ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది ఖుష్బూ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఖుష్బూ తాజాగా తన ట్విట్టర్‌లో స్టన్నింగ్ ఫొటో షేర్ చేసింది.
ఇందులో ఖుష్బూ చాలా స్లిమ్‌గా కనిపించి అందరు ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ‘‘బరువు తగ్గాలన్న లక్ష్యంతో చేసిన హార్డ్‌వర్క్‌కి తగ్గ ఫలితం ఇది. ఫిట్‌గా ఉండాలనే ఈ హార్డ్‌వర్క్’ అన్నారు ఖుష్బూ.