‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేశ్ ప్రకటించారు. ఇటీవల ‘మా’ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం (డీఆర్సీ) ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు.
వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని డీఆర్సీ ఛైర్మన్ కృష్ణంరాజు అప్పుడు చెప్పారు. తాజాగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించమని… సెప్టెంబర్ 12 లేదా అక్టోబర్ 10 – నెలలో రెండో ఆదివారం నిర్వహిస్తే, సభ్యులందరికీ ఓటు వేయడానికి వీలుపడుతుందని ఆయనో లేఖ రాశారు. తుది నిర్ణయం అధ్యక్షుడికి వదిలేశారు. నిబంధనల ప్రకారం అధ్యక్ష హోదాలో అక్టోబర్ 10న నిర్వహించాలని నరేశ్ నిర్ణయం తీసుకున్నారు.