Home / MOVIES / మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ గా సోహెల్

మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ గా సోహెల్

బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ త‌ర్వాత ప‌లువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఫైనల్‌లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం త‌న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశాడు.

సోహెల్ కొత్త చిత్రానికి మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సోహెల్ ప్రెగ్నెంట్‌గా క‌నిపించి అల‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ ఫైనల్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందకున్నారు సొహైల్. అంతేకాదు తాను తీయబోయే సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చి హెల్ప్ చేయాలని సొహైల్ అనడంతో.. ఆడియో ఫంక్షన్‌కే కాదు.. ఆ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేస్తా.. కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా మాట ఇస్తున్నా అంటూ సొహైల్‌కి ప్రామిస్ చేశారు చిరంజీవి. మ‌రి చెప్పిన మాట ప్రకారం చిరు ఇందులో న‌టిస్తాడా అన్న‌ది చూడాలి.