తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొన్నటి వరకు తమిళ ప్రేక్షకులని మాత్రమే అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
అయితే విజయ్ సేతుపతి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని ఆమెని రిజెక్ట్ చేశానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. సినిమా యూనిట్ సభ్యులకు నేను ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించిన విషయం తెలియదు. అందుకే ఆమెను నా సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. కాని నేను చేయను అని చెప్పేశా.
నాకు కృతి వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. అందుకే ఆమెతో కలిసి నటించలేను అని టీమ్ కు చెప్పాను అన్నాడు విజయ్. కూతురిలా భావించిన అమ్మాయితో ఎలా రొమాన్స్ చేస్తాను చెప్పండి అంటూ యూనిట్ సభ్యులకు చెప్పాడట. ఎప్పటికీ తనతో హీరోయిన్‌గా చేయనని విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన లాభం సినిమా చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు.