Home / SLIDER / హుజూరాబాద్‌ లో ఇప్పటివరకు 12,521 మందికి  దళిత బంధు

హుజూరాబాద్‌ లో ఇప్పటివరకు 12,521 మందికి  దళిత బంధు

 దళిత బంధు పథకం కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు.

మంగళవారం రాత్రి కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మా ట్లాడుతూ.. దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్‌లో సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు కలెక్టర్‌ సహా అధికారులను అభినందించారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమైన లబ్ధిదారులు మంచి యూనిట్లు ఎంపిక చేసుకునేలా అధికారులు సహకరించాలని కోరారు. మిగతా వారికి త్వరలోనే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.