తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఉత్తర్వుల జారీకి కృషి చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి మంత్రుల నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ పోరాట యోధులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంలో సీఎం కేసీఆర్ చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం వల్ల చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.