Home / MOVIES / ‘బంగార్రాజు’ లో మరో ఇద్దరు భామలు

‘బంగార్రాజు’ లో మరో ఇద్దరు భామలు

 

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ , కళ్ళాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాల్ని ఒకేసారి ట్రాక్ మీద పెట్టారు. సూపర్ హిట్టయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా నటించిన నాగ్ పాత్ర ‘బంగార్రాజు’ నే టైటిల్ గా తీసుకొని సీక్వెల్ రూపొందిస్తున్నారు.

ఇందులో నాగార్జున తో పాటుగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నారు. చైతూ కు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా..  నాగ్ సరసన ఇందులో మళ్ళీ రమ్యకృష్ణే కథానాయికగా నటిస్తున్నారు. ఇక ‘బిగ్ బాస్ 4’ ఫేమ్ మోనాల్ గజ్జార్ కూడా బంగార్రాజు మూవీలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా..  ఇందులో ఆమెపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ కూడా చిత్రీకరిస్తారట.

ఇదిలా ఉండగా  తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో ఇద్దరు బ్యూటీస్ కూడా నటిస్తున్నారని టాక్. వేదిక, మీనాక్షి చౌదరి లు కూడా ఇందులో ప్రత్యేకపాత్రల్లో నటిస్తున్నారట. వీరిద్దరూ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.