Home / SLIDER / ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు.

ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం వెళ్లిన కేసీఆర్ దాదాపు 9 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసారు. ఆ సమయంలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదే విధంగా జలశక్తి మంత్రి షెకావత్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు.