తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రం తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు.
ఇద్దరు ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. అయితే, ఎందుకనో ఈ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో అదే కథను విజయ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా కోసం కియారాను హీరోయిన్‌గా ఎంచుకున్నట్టు వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలుగులో కియారా.. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసింది.
ఆ తర్వాత వరుస బాలీవుడ్ మూవీస్‌తో బిజీ అయింది. ఇటీవలే మళ్ళీ శంకర్ – చరణ్ మూవీ కోసం దిల్ రాజు కియారాను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ – వంశీ పైడిపల్లి మూవీకి తీసుకున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట. కాగా ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ మూవీలో నటిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారట