నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్స్ కేటాయింపులో ఈసారి గౌడకులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టిసారించారు.
జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు సమాచారం. ముందుగా లక్కీ డ్రా ద్వారా ఏయే దుకాణాలను రిజర్వేషన్‌లోకి తేవాలన్నది నిర్ణయించాక ఆయా దుకాణాలకు ఆ సామాజికవ ర్గం వారే పోటీపడేలా ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం.
2019-21 సంవత్సరానికిగాను రాష్ట్రంలో రిటైల్ మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు అక్టోబర్ 31తో ముగియాల్సి ఉన్నది. కానీ, దీనిని నవంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో మేశ్‌కుమార్ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.