Home / MOVIES / రష్మిక మందన్న చాలా Costly గురు..?

రష్మిక మందన్న చాలా Costly గురు..?

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు రష్మిక మందన్న. గీత గొవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి కుర్రకారు మదిని దోచారు. సౌత్‌లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉంది. బాలీవుడ్‌లోను మిషన్ మజ్ను, గుడ్‌బై వంటి చిత్రాల్లో కనిపించనుంది. మరికొన్నిప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. నటిగా రష్మిక సౌత్‌లోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో నిర్మాతలు ఎంత్తైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 

ఆమె ఒక చిత్రానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆమె నికర ఆస్తుల విలువ 400మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు సమాచారం. సంపాదించిన డబ్బునంతా ఆమె రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే ముంబయి, గోవా, కూర్గ్ ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేసింది. బాలీవుడ్‌లోను సినిమాలు చేస్తుండటంతో ముంబైలోను ఉండాల్సి వస్తోంది. ఫలితంగా అక్కడ కూడా ఇల్లును కొనుగోలు చేసింది. 

కొన్ని నెలల క్రితం రష్మిక రూ.50లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్-సి క్లాస్ కారును తనకు తాను గిఫ్ట్‌గా  ఇచ్చుకుంది. రూ. 40లక్షల విలువైన ఆడి-క్యూ 3 కారును కూడా కొనుగోలు చేసింది. ఇప్పటికే టయోట ఇన్నోవా, హ్యుండాయ్ క్రెటా ఆమె వద్ద ఉన్నాయి.  

అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో శ్రీవల్లీ అనే పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ మూవీలో ఆమె గిరిజన గూడెం యువతి పాత్రలో కనిపించనుంది.  తమిళ సూపర్‌స్టార్ విజయ్ తెలుగులో చేయబోయే తలపతి 66వ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు కూడా ఆమె రేసులో ఉంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా, దిల్ రాజు నిర్మించనున్నారు. 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum