Home / MOVIES / తన పాపకు “రాధా”అని పెట్టడానికి కారణం చెప్పిన శ్రియా

తన పాపకు “రాధా”అని పెట్టడానికి కారణం చెప్పిన శ్రియా

అందాల ముద్దుగుమ్మ శ్రియ కొద్ది రోజుల క్రితం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గ‌త ఏడాది పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాన‌ని తెలియ‌జేసి అంద‌రికి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ్రియ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌కి అంద‌రు షాక్ అయ్యారు.ఇక శ్రియ త‌న కూతురికి రాధా అనే పేరు పెట్టిన‌ట్టు కూడా తెలియ‌జేయ‌గా, ఎన్నో మోడ్ర‌న్ నేమ్స్ ఉండ‌గా, ఓల్డ్ నేమ్‌పై అంత ప్ర‌త్యేక దృష్టి సారించ‌డం వెన‌కు ఏదైన క‌హానీ ఉందా అంటూ శ్రియ‌ని ప్ర‌శ్నించారు నెటిజ‌న్స్.

తాజాగా దీనిపై స్పందించిన శ్రియ‌.. నాకు కూతురు పుట్టింది అనే విషయం చెప్పిన వెంటనే అమ్మ రాధా రాణి వచ్చేసిందన్నమాట అంటూ ఆనందంగా అనేసింది. దీంతో నా భ‌ర్త మీ అమ్మ‌గారు ఆనందంలో ర‌ష్య‌న్‌లో మాట్లాడేశారుగా అని అన్నాడు.

అప్పుడే నాకు తెలిసింది ఏంటీ అంటే రష్యన్ భాష లో రాధా అంటే సంతోషం అని అర్థం. రష్యన్ భాష లోనే కాకుండా ఇతర పలు భాషల్లో కూడా రాధా పేరుకు మంచి ప్రాముఖ్యత ఉంది. అందుకే ఇద్ద‌రం క‌లిసి రాధా అనే పేరుని ఫిక్స్ చేశాం. రాధాకు చివ‌ర‌లో శ‌రన్ మరియు కోస్చీవ్ పదాలను కలిపాము అంటూ శ్రియ చెప్పుకొచ్చింది.