Home / MOVIES / ‘భీష్మ’ దర్శకుడితో వరుణ్ తేజ్

‘భీష్మ’ దర్శకుడితో వరుణ్ తేజ్

‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వెంకీ కుడుముల .. తదుపరి చిత్రం ఇంకా సెట్ కాలేదు. కథ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ సినిమా తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నారట.

అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీకి సమయం ఆసన్నమైంది. వరుణ్ తేజ్ హీరోగా త్వరలోనే వెంకీ తదుపరి చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని తెలుస్తోంది.ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా వెంకీ కుడుముల వరుణ్ ను కలిసి కథ నేరేట్ చేశారట. వరుణ్ కు కూడా కథ బాగా నచ్చిందట.

భీష్మ తరహాలోనే ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్ 3, గని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న  వరుణ్ తేజ్.. అవి కంప్లీట్ అయ్యే టైమ్ కి వెంకీ కుడుముల చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళతారట. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ కాంబోలో మూవీ కార్యరూపం దాల్చితే.. సినిమాకి మంచి క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు.