యార బాలకృష్ణ అధ్యక్షతన హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కేయూ JAC చైర్మన్ బొల్లికొండవీరెందర్ KU JACకన్వినర్ కత్తెరపెల్లి దామోధర్ మాట్లాడుతూ….ఈటెల రాజేందర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాజీనామా చేసాడేగాని నియోజక వర్గ అభివృద్ధి కోసం కాదని…. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తనన్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ నిరుద్యోగులనోట్లో మట్టికొడుతుందని…విద్యార్థి ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ ని గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజల్నికోరారు…..
గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి ఉద్యమకారుడు.సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆనాడు చదువుల కోసం పట్నం వెళ్లి నానా ఇబ్బందులు పడుతూ హాస్టల్ లో ఉండి చదువుకొని ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి చదువుకుంటున్న సమయంలో కెసిఆర్ గారు ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో మా తెలంగాణ మాకు కావాలనే ఉద్దేశంతో అందరి విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి ఉస్మానియా వేదికగా జరిగిన ఉద్యమంలో ప్రత్యేకమైన పాత్రని పోషించి లాఠీలు తూటాలకు భయపడకుండా పోలీసు కేసులను ఎదురించి 120 పోలీస్ కేసులు ఉండి 120 కేసులున్న శ్రీనన్న గా పేరును సంపాదించిన శ్రీనన్న నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక TRSV రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాడు.
ఆ తర్వాత అనేక జిల్లాలు తిరిగి మరోసారి విద్యార్థులను ఏకం చేసి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయిస్తున్న మన గెల్లు శ్రీనన్న గారికి శాసనాలను తయారు చేసే ఒక అద్భుతమైన ప్రాంగణంలో అడుగు పెట్టె అవకాశం వచ్చింది హుజురాబాద్ ఉపఎన్నిక ద్వారా …ఇలాంటి చురుకైన విద్యార్థి నాయకున్ని అసెంబ్లీ పంపిస్తే గతంలో ఈటెల రాజేందర్ చేయలేని అభివృద్ధిని గె ల్లు శ్రీనివాస్ చేసి చూపిస్తాడు…….ఈ కార్యక్రమంలో నాయకులు జున్న రాజుయాదవ్…కంజర్ల మనోజ్, బైరపాక ప్రశాంత్, పసునూరి టోని,అర్షం మధుకర్,ఉజ్జేతుల విజేందర్ తదితరులు పాల్గొన్నారు…..