ఖమ్మంజిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లాడ మండలంలోని నూతనకల్ గ్రామానికి చెందిన కొమ్ము మౌనిక అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో వెంటనే ఆమెను తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నవ్యకాంత్ అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బందితో కలిసి హాస్పటల్ కు చేరుకున్నారు. గర్భిణీని పరీక్షించిన డాక్టర్ నవ్య కాంత్ ఆమెకు సాధారణ కాన్పు అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు.
తెల్లవారుజామున 12 గంటల 42 నిమిషాలకు సాధారణ కాన్పు ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్ ను డాక్టర్ నవ్యకాంత్ చేతులమీదుగా ఆమెకు అందించారు. అర్ధరాత్రి సమయంలో కూడా వైద్య సేవలు అందించిన డాక్టర్ నవ్య కాంత్, సూపర్ వైజర్ పుల్లయ్య, సీహెచ్ ఓ భాస్కర్, ఆసుపత్రి సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.