యాంగ్రీ హీరోగా టాలీవుడ్‌లో టాప్ క్రేజ్ తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది.రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. వరదరాజ గోపాల్‌కు ఐదుగురు సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్‌కు రెండో సంతానం.శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వరదరాజన్ అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.