Home / SLIDER / క్షీరసాగర్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

క్షీరసాగర్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

ప్రజా ప్రయోజనార్థం గ్రామ ప్రజలకు ఉచిత మినరల్‌ వాటర్‌ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం, కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్షీరసాగర్ గ్రామ ప్రజానీకానికై ఏంపీటీసీ బాల్ రెడ్డి సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి అభినందనీయమైనవని, గ్రామంపై బాల్ రెడ్డికి ఉన్న మమకారం ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino