ఏపీలోని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. TGT, PGTలను జోన్ యూనిట్, ప్రిన్సిపాళ్లను స్టేట్ యూనిట్గా బదిలీ చేస్తారు. 2021 నవంబర్ 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా.. 5 ఏళ్ల సర్వీసు పూర్తైన వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయనుండగా.. అర్హులైన టీచర్లు, ప్రిన్సిపాళ్లు తమ దరఖాస్తులను సమర్పించాలి.
